కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందారు. మరో 12మంది తీవ్ర అస్వస్థతకి గురయ్యారు.ఈ సంఘటన బీహార్ లోని మోతీహరి జిల్లాలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మోతీహరి జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఈ మరణాలు సంభవించాయి. కాగా తీవ్ర అస్వస్థతకు గురయిన వారిని ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం 2016 ఏప్రిల్ లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, వినియోగంపై సంపూర్ణ నిషేధాన్ని విధించింది. ఈ చర్య గణనీయమైన సంఖ్యలో మహిళా ఓటర్ల మనసు గెలుచుకుంది. అయితే నిషేధం ఉన్నప్పటికీ రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే స్థానికంగా తయారైన కల్తీ మద్యం తాగి ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
- Advertisement -