ప్రమాదవశాత్తు అడవిలో మంటలు చెలరేగాయి. దాంతో దక్షిణ కొరియా తూర్పు తీర ప్రాంతం అగ్నికి ఆహుతయింది. సామ్ చెక్ లో 21వేల 179ఎకరాల అడవులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు తీవ్రతరం కావడంతో చుట్టుపక్కల నివసించే ఆరు వేల మంది జనం తమ ఇళ్లను వదిలి వెళ్ళారు. ఉల్జిన్‌లోని పర్వతానికి సమీపంలో ఉన్న రహదారిపై మంటలు ప్రారంభమయ్యాయి..ఆ మంటలు ఉత్తరాన సామ్‌చెక్‌కు విస్తరించాయి, అధిక గాలులు ఈ మంటలకి ఆజ్యం పోసింది. 153 ఇళ్ళు , 53 ఇతర నిర్మాణాలు ధ్వంసమయ్యాయి, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement