Saturday, November 23, 2024

Breaking : ట్రైన్ లో చెల‌రేగిన‌ మంట‌లు – రెండు కోచ్ లు దగ్థం

రైలులో అక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. ఢిల్లీ నుంచి వ‌స్తున్న ప్రీడ‌మ్ ఫైట‌ర్ ఎక్స్ ప్రెస్ లో మంట‌లు చెల‌రేగాయి. ఈ రైలు బీహార్ లోని మ‌ధ‌/బ‌ని రైల్వేస్టేష‌న్ లో ఆగి వున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కాగా ఈ మంట‌లు చెల‌రేగిన స‌మ‌యంలో ట్రైన్ లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. మంట‌లు చెల‌రేగ‌డంతో స్టేషన్‌లో ఉన్న వ్యక్తులు, సిబ్బంది వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం ప్రారంభించారు. స‌మాచారం మేర‌కు అగ్నిమాపక శాఖ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మూడో నంబర్ ప్లాట్‌ఫాంపై ఆగివున్న ఫ్రీడమ్ ఫైటర్ ఎక్స్‌ప్రెస్ బోగీల్లో మంటలు చెలరేగాయి. దాంతో ఇప్పటివరకు రెండు కోచ్‌లు కాలిపోయాయని, మూడవ బోగీ కూడా మంటల్లో చిక్కుకుందని కూడా చెబుతున్నారు.

ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.. ఎస్‌డిఓ అశ్వనీకుమార్, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ రాజీవ్ కుమార్, సిటీ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ అమిత్ కుమార్ బృందంతో కలిసి రైల్వే స్టేషన్‌కు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడివున్నారు. కాగా ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, శనివారం ఉదయం 09.13 గంటలకు సమస్తిపూర్ డివిజన్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఖాళీ రైలు కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే చర్యలు తీసుకుని 09:50 గంటలకు మంటలను ఆర్పివేశారు. రాక్ మూసి ఉన్న స్థితిలో ఉంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌లు దర్యాప్తు చేస్తున్నాయి. దీన్ని రైల్వే యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఉన్నత స్థాయి విచారణ జరుపుతామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement