Wednesday, November 20, 2024

Breaking: కిడ్నాప్ భ‌యంతో.. ర‌న్నింగ్‌లో ఉన్న ఆటోలోంచి దూకేసిన యువ‌తి..

ఓ 28 ఏళ్ల యువ‌తి క‌దులుతున్న ఆటోలొంచి స‌డెన్‌గా కిందికి దూకేసింది. త‌న‌ను కిడ్నాప్ చేస్తున్నార‌న్న భ‌యంతోనే తాను ఆటోలోంచి దూకేశాన‌ని తెలిపింది. హ‌ర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కాగా, ఈ విష‌యాన్ని త‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేసుకుంది. త‌న పేరు నిశిత అని.. త‌నో క‌మ్యూనికేష‌న్ స్పెష‌లిస్ట్‌గా పేర్కొంది ఆ యువ‌తి. అయితే త‌ను ఎక్కిన ఆటో తిన్న‌గా వెళ్ల‌కుండా డ్రైవ‌ర్ రాంగ్ రూట్‌లో తీసుకెళ్లాడ‌నీ, కొంత‌దూరం వెళ్లాక త‌ను వెళ్లాల్సిన రూట్ కాక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చి ఆటోలోంచి దూకేసిన‌ట్టు తెలిపింది ఆ యువ‌తి.

‘‘నేను ఆటో ఎక్కడానికి ముందే అత‌నితో చెప్పాను. నా ద‌గ్గ‌ర క్యాష్ లేదు. పేటీఎం ద్వారా అమౌంట్ పే చేస్తాను అని. దానికి ఆటో డ్రైవర్ కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు మ‌ధ్యాహ్నం దాదాపు 12.30 అవుతుంద‌నుకుంటా. ఆటోలో కూర్చున్నాను. ఆ డ్రైవ‌ర్ మాత్రం త‌క్కువ సౌండ్‌తో డివోష‌నల్ సాంగ్ వింటున్నాడు. అయితే కొంత‌దూరం వెళ్లాక అక్క‌డో మూల మ‌లుపు వ‌చ్చింది. అక్క‌డినుంచి రైట్ సైడ్ వెళ్తే మా ఇల్లు వ‌స్తుంది.. కానీ, డ్రైవర్ మాత్రం లెఫ్ట్ సైడ్ ట‌ర్న్ తీసుకున్నాడు. దాంతో నేను అత‌డిని అడిగాను. రైట్ సైడ్ క‌దా వెళ్లాల్సింది. లెఫ్ట్‌కు ఎందుకు అని..

అతని నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దాంతో నేను కాస్త గ‌ట్టిగానే అరిచాను. భ‌య్యా.. మేరా సెక్టార్ రైట్ మే హే.. ద ఆప్ లెప్ట్ మే క్యు లేకే జా ర‌హే హో.. అని అడిగాను. దానికి ఆటో డ్రైవర్ నుంచి రెస్సాండ్ రాలేదు. అత‌ని ఎడ‌మ భుజం మీద దాదాపు 8 నుంచి 10 సార్లు త‌ట్టాను. అయినా కూడా అత‌ను స్పందించ‌కుండా అట్లాగే వెళ్ల‌డంతో నాకు డౌటొచ్చింది. దాంతో రన్నింగ్ లో ఉన్న ఆటో నుంచి దూకేశాను. నాకు చిన్న‌పాటి గాయాల‌య్యాయి. అయినా ప‌ర్వాలేదు కానీ, నేను పెద్ద గండం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాను అనే అనుకోవాలి.’’ అని ట్విట్ట‌ర్‌లో బాధిత యువతి పేర్కొంది. దీనిపై స్పందించిన పాలం విహార్ పోలీస్ స్టేష‌న్ ఎస్ హెచ్‌వో జితేంద్ర యాద‌వ్ సీసీటీవీ ఫుటేజీ ప‌రిశీలించి నిందితుడిని ప‌ట్టుకుంటామ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement