ఉక్రెయిన్ లో అణుభయంతో ఉద్రికత్త చోటు చేసుకుంది. జఫ్రోజియాన్యూక్లియర్ ప్లాంట్ నుంచి రేడియేషన్ విడుదలయింది. ప్రమాదకరస్థాయిలో ఉందంటున్నారు ఉక్రెయిన్ వాసులు. జప్రోజియా న్యూక్లియర్ ప్లాంట్ లో భయం నెలకొంది..మంటల్లో ప్లాంట్ చిక్కుకోవడంతో ప్రమాదకరంగా మారింది. దాంతో ఏక్షణమైనా ప్లాంట్ పేలిపోతుందని భయపడుతున్నారు అంతా. అదే జరిగితే అణు విస్పోటనం తప్పదనే ఆందోళన మొదలయింది. అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని వేడుకుంటోన్న జెలెన్ స్కీ. రష్యా అధ్యక్షుడు పుతిన్ అణు ఉగ్రవాద భయాన్ని సృష్టిస్తున్నారని జెలెన్ స్కీ అన్నారు. చెర్నోబిల్ దుర్ఘటనను మళ్లీ సృష్టించాలనుకుంటున్నారని జెలెన్ తెలిపారు. ప్రపంచానికి శాపమేనంటున్నాయి యూరోప్ దేశాలు. అయితే దీనివల్ల ఏ ప్రమాదం లేదని రష్యా ఉదయం చెప్పింది. రేడియేషన్ ఎఫెక్ట్ పై ఉక్రెయిన్ నే నిందిస్తోంది రష్యా. రేడియేషన్, రష్యా తీరుపై తలలు పట్టుకుంటోంది ప్రపంచం.
Advertisement
తాజా వార్తలు
Advertisement