ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. 90రోజులుగా ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. 50నుంచి వందశాతం ధరలు పెరిగాయని కేసీఆర్ తెలిపారు. రైతాంగం ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉందని చెప్పారు. డీజీల్ ధరల పెరుగుదలతో రైతులు నష్టాల్లో ఉన్నారని తెలిపారు. వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం చెబుతోందన్నారు. కానీ వ్యవసాయ పెట్టుబడి రెట్టింపయ్యేలా కనిపిస్తోందని అన్నారు. రైతుల పెట్టుబడి మొత్తాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ లేఖలో రాశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..