సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి కన్నుమూశారు. ఆయన వయసు 49సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కందికొండ. ఆయన స్వస్థలం నర్సంపేట మండలం నాగుర్లపల్లి.తెలంగాణ సంస్కృతిని చాటేలా పాటలు రాశారు.పలు హిట్ చిత్రాలకు పాటలు రాశారు కందికొండ. తెలంగాణ యాసలో పాటలు రాయడం.. బతుకమ్మ పాటలను ప్రపంచానికి పరిచయం చేశారు. పలు చిత్రాల్లో సూపర్ హిట్ పాటలు రాసిన కందికొండ.. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. క్యాన్సర్ మహమ్మారితో దాదాపు రెండేళ్లు పోరాడిన కందికొండ.. ప్రస్తుతం పెరాసిస్ సమస్యతో బాధపడుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం కీమో థెరపీ చేయించుకోవడంతో.. కందికొండ స్పైనల్‌కార్డ్ లోని సీ1 సీ2 భాగాలు దెబ్బతిన్నాయి. దీంతో కందికొండ నడవలేని స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో కందికొండ ఆర్థిక సాయం ఎదురుచూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కందికొండ ఈరోజు (మార్చి 12న) తుదిశ్వాస విడిచారు. రేపు హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు సమాచారం..
Breaking : ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత – రేపు అంత్యక్రియలు
Advertisement
తాజా వార్తలు
Advertisement