మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించారు. వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ పథకం వల్ల అగ్రవర్ణ పేద మహిళలకు చేయూతగా నిలవనుంది. 45-60ఏళ్లలోపు పేద అగ్రవర్ణ మహిళలు ఈ పథకానికి అర్హులని తెలిపారు. వారికి మంచి చేసే దిశగా ఆలోచన చేశామన్నారు జగన్. 3.92లక్షల ఖాతాల్లో రూ. 589కోట్లని జమ చేశారు. ఒక్కో మహిళకు ఏడాదికి రూ. 15వేల చొప్పున సాయం అందనుంది. ఇది ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదన్నారు సీఎం జగన్. ఇప్పటికే వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750చొప్పున అందిస్తున్నామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..