ఏపీలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మూ పర్యటిస్తున్నారు. ఈ మేరకు సీఎం జగన్ తో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముర్మును సన్మానించారు సీఎం జగన్..ముర్ము వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ ద్రౌపది ముర్ముని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తొలిసారి గిరిజన మహిళ రాష్ట్రపతి కాబోతున్నారన్నారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ప్రభుత్వం మనది అని అన్నారు జగన్. అందులో భాగంగానే మరో అడుగు ముందుకు వేస్తూ ముర్ముని రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని తెలిపారు. వైసీపీ ఎంపీలు..ఎమ్మెల్యేలతో ద్రౌపది ముర్ము భేటీ అయ్యారు. ఈ మేరకు మంగళగిరిలోని కన్వెన్షన్ సెంటర్ లో సమావేశం అయ్యారు.
Breaking : ద్రౌపది ముర్మూని రాష్ట్రపతిగా గెలిపిద్దాం-సీఎం జగన్
Advertisement
తాజా వార్తలు
Advertisement