బేగంపేట్ డివిజన్ లో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా మయుర్ మార్గ్ లో 45 కోట్ల రూపాయలతో నాలా అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు…ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు …మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. డిప్యూటి మేయర్ మోతే శ్రీలత పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ..వర్షం వస్తే ఈ ప్రాంతం ఎన్నో అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. దీనికి శాశ్వత పరిష్కారంగా మంత్రి కేటీఆర్ చేతులమీదుగా చర్యలు తీసుకోవడం జరిగిందని.. హైదరాబాద్ మహానగర అభివృద్ధి కొరకు కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని..
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీలను హైదరాబాదులో నెలకొల్పడానికి ఆయన చేస్తున్న కృషి ఎనలేనిది అని అన్నారు…బేగంపేట వాసులకు ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి అన్నారు…ఇందులో భాగంగానే 45 కోట్ల తో నాల అభివృద్ధి , నూతనంగా నిర్మిస్తున్న స్మశాన వాటిక ,రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ, ప్రజలకు మౌలిక సదుపాయాలు వంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు..నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..