Friday, November 22, 2024

Breaking: రేప‌టి నుండే టాటా ఎయిరిండియా సేవ‌లు – క‌రాచీ నుండి ముంబైకి తొలి విమానం

రేప‌టి నుండి టాటా గ్రూప్ నుంచి ఎయిరిండియా సేవ‌లు అందించ‌నుంది. ఈ మేర‌కు ప్ర‌పంచ‌స్థాయి విమాన‌యాన‌సంస్థ‌ని రూపొందిస్తాం అని టాటా తెలిపారు. ఎయిరిండియాలో వంద‌శాతం వాటిని కేంద్రం విక్ర‌యించింది. 69ఏళ్ల త‌ర్వాత టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా ద‌క్కింది..గ‌తేడాది అక్టోబ‌ర్ 8న ఎయిరిండియా బిడ్ ను గెలుచుకుంది టాటా గ్రూప్. రూ.18వేల కోట్ల‌ని వెచ్చించి ఎయిరిండియాను సొంతం చేసుకుంది టాటా గ్రూప్ సంస్థ‌. క‌రాచీ నుండి ముంబైకి తొలి విమానం బ‌య‌లుదేర‌నుంది. 1946లో ఎయిరిండియాగా పేరుని మార్చారు. స్వాతంత్య్రం అనంత‌రం 49శాతం భాగ‌స్వామ్యం తీసుకుంది కేంద్రం.
టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను.. ప్రభుత్వం నుండి అధికారికంగా స్వాధీనం చేసుకుంది.

టాటా గ్రూప్‌లో ఎయిరిండియా తిరిగి చేరినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము అని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. టాటా గ్రూప్ గురువారం ఎయిర్ ఇండియాను ప్రభుత్వం నుండి అధికారికంగా స్వాధీనం చేసుకుంది. “ఎయిరిండియాను తిరిగి టాటా గ్రూప్‌లో చేర్చుకోవడం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాము , దీనిని ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా మార్చడానికి కట్టుబడి ఉన్నాము” అని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. మిస్టర్ చంద్రశేఖరన్ కూడా అధికారిక అప్పగింతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement