Friday, November 22, 2024

Breaking : క‌రోనా ఆంక్ష‌ల‌ను స‌డ‌లించిన ఢిల్లీ డీడీఎంఏ – తెరుచుకోనున్న స్కూల్స్

ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు త‌గ్గుతున్నాయి. దాంతో ఇప్ప‌టి వ‌ర‌కు విధించిన క‌రోనా ఆంక్ష‌ల‌ని అక్క‌డి ప్ర‌భుత్వాలు స‌డ‌లిస్తున్నాయి. రీసెంట్ గా ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ( డీడీఎంఏ) కరోనా ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా ఢిల్లీలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆంక్షలు సడలించాలంటూ.. ప్రభుత్వాన్ని .. ప్రజలు కోరుతున్నారు. తాజాగా ఈ అనుమతులతో సాధారణ పరిస్థితులు నెలకొననున్నాయి.దాంతో చాలా రోజుల నుంచి మూతపడ్డ స్కూళ్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుండి.. 9-12వ తరగతులకు… నర్సరీ నుండి 8వ తరగతి వరకు, ఫిబ్రవరి 14 నుండి పాఠ‌శాల‌లు ప్రారంభం కానున్నాయి. స్కూల్స్ తో పాటు అన్ని రెస్టారెంట్లు రాత్రి 11 గంటల వరకు తెరిచేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది ప్ర‌భుత్వం. అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ కార్యాలయాలు 100% సామర్థ్యంతో పనిచేయడానికి పర్మిషన్లు ఇచ్చింది. జిమ్‌లు స్విమ్మింగ్ పూల్స్ కూడా పూర్తిగా తెరవనున్నారు. మరోవైపు రాత్రి కర్ఫ్యూను ఒక గంట తగ్గించి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement