Thursday, November 21, 2024

Breaking : సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకున్న కేంద్రం .. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం ..

నేటి నుండి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఉద‌యం స‌భ మొద‌ల‌వ్వ‌గానే వెంట‌నే వాయిదా ప‌డింది. ప్ర‌తిప‌క్షాల తీరుకు స‌భ‌ని వాయిదా వేయాల్సి వ‌చ్చింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌భ‌ని స‌జావుగా సాగేలా చూడాల‌ని కోరారు. కాగా సాగు చ‌ట్టాల‌ను కేంద్రం వెన‌క్కి తీసుకుంది. లోక్ స‌భ స‌మావేశాలు ప్రారంభం కాగా అందులో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశ పెట్టింది. వాయిదా ప‌డిన స‌భ .. రెండో సారి ప్రారంభం కాగానే కేవలం ఐదు నిముషాల్లో మూజువాణి ఓటుతో బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.మధ్యాహ్నాం రెండు గంటలకు సభ తిరిగి సమావేశం కానుంద‌ని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. టీఆర్ఎస్ తో పాటు కొన్ని విపక్షాలు నిరసనలు తెలుపుతూ గ్యాలరీలోకి వెళ్లారు. కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం ఇవేవి ప‌ట్టించుకోకుండా బిల్లు ను ప్ర‌వేశ‌పెట్ట‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement