ఉభయగోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. భీమవరం నుంచి అమలాపురం వరకు భారీగా పందాలు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో సిద్ధమయ్యాయి బరులు. కాగా బరుల దగ్గర కోవిడ్ నిబంధనలు బేఖాతర్ గా కనిపిస్తున్నాయి. చాలా మంది మాస్కులు కూడా లేకుండా కోడి పందాలకు హాజరవుతున్నారు. సోషల్ డిస్టెన్స్ కూడా పాటించడంలేదు. ఇక పందెం బరిలో సై అంటూ కాళ్లు దువ్వుతున్నాయి పందెం కోళ్లు. భీమవరం, ఉండి, వెంప, తణుకు, దెందులూరు, రావులపాలెం, అమలాపురంలో భారీగా బరులు ఉన్నాయి. రామచంద్రాపురం, ముమ్మిడివరం, కాకినాడ, రాజోలు, ఐ.పోలవరం, రాజానగరంలో జోరుగా పందాలు కొనసాగుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..