మహారాష్ట్ర : ఫారెస్ట్ సిబ్బందిపై పులి దాడి చేసింది. పులుల లెక్కింపుకోసం అటవీసిబ్బంది వెళ్ళగా ఓ మహిళా ఉద్యోగినిపై పులి దాడి చేసి చంపేసింది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. తాడోబా- అంధారి టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా తాడోబా టైగర్ రిజర్వ్ కోలారా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మహిళా ఫారెస్ట్ రేంజర్ స్వాతి ధుమ్నే(43) తన విధుల్లో ఉండగా పులి దాడి చేసింది. తాడోబా ప్రాజెక్ట్ లో పులుల గణనలో ఉండగా దాడి చోటు చేసుకుంది. పులుల లెక్కింపులో భాగంగా కోర్ జోన్ 97లో కోలార గేటు వద్ద ట్రాజెక్టరీ లైన్ వేసే పనులు ప్రారంభం అయ్యాయి. ఫారెస్ట్ రేంజర్ స్వాతి ధుమ్నే కూడా పనికి సిద్ధమయ్యేందుకు అక్కడికి వెళ్లారు. అదే సమయంలో మాయ అనే పులి వారిపై దాడి చేసింది. నలుగురు అటవీ సిబ్బంది పులిని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయితే పులి స్వాతిని దట్టమైన అడవిలోకి లాక్కెల్లింది.సమాచారం అందుకున్న తాడోబా టైగర్ రిజర్వ్ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సెర్చ్ ఆపరేషన్ లో మృతదేహం లభ్యమైంది
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..