కోవిడ్ పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. కోవిడ్ నివారించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. ఆసుపత్రుల్లో సిబ్బంది, మౌలిక వసతులు చూసుకోవాలని సూచించింది.ఆసుపత్రుల్లో పడకల లభ్యతను పర్యవేక్షిస్తుండాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..