కాంగ్రెస్‌ను వీడి పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను స్థాపించిన అమరీందర్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. “నేను పటియాలాలో గెలవడం ఖాయం. ఎన్నికల్లో మనం గెలుస్తామని భావిస్తున్నాను.. కాంగ్రెస్ వేరే ప్రపంచంలో జీవిస్తూ తుడిచిపెట్టుకుపోతారన్నారు. భగవంత్ మాన్ దేశ వ్యతిరేకి, ఆయన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు ఇస్తున్నారని అన్నారు. కాగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు పాటియాలాలో ఓటు వేశారు. తమ పార్టీ మంచి పనితీరు కనబరుస్తోందని, క్షేత్రస్థాయి నుంచి సానుకూల నివేదికలు వస్తున్నాయని మాజీ సీఎం చెప్పారు. ఈసారి రాష్ట్రం బహుముఖ పోటీని చూస్తోందన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న చరణ్‌జిత్ సింగ్ చన్నీ చమ్‌కౌర్ సాహిబ్ , బదౌర్ రెండు స్థానాల నుండి పోటీ చేస్తున్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్‌సర్ (తూర్పు)లో SAD అభ్యర్థి బిక్రమ్ సింగ్ మజిథియా, ఆప్ అభ్యర్థి జీవన్‌జ్యోత్ కౌర్, బీజేపీకి చెందిన జగ్‌మోహన్ సింగ్ రాజుతో తలపడుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement