బిజెపి, ఎస్పీ పార్టీలు దొందూ దొందేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ అన్నారు. రాయ్ బరేలీలోని సరేనిలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ,ఎస్పీ పార్టీలపై విరుచుకుపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రకటించిన పథకాలనే ఇప్పుడు తీసుకురావాలని రెండు పార్టీలు అనుకుంటున్నాయని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని ప్రియాంక గాంధీ అన్నారు. కిసాన్ బిల్లు వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారని ..అయినా నరేంద్రమోడీ గుండె కరగలేదన్నారు. ఎన్నికలు రాగానే హఠాత్తుగా మోడీ వచ్చి తప్పు చేశామని అన్నారు. ఇంతకు ముందు వారికి తెలియదాఅని విరుచుకుపడ్డారు. ‘సుధా ద్వివేదిని గెలిపిస్తే తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. సరేనిలో కాంగ్రెస్ అభ్యర్థి సుధా ద్వివేదికి అనుకూలంగా జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ‘బీజేపీ ప్రభుత్వం రైతు, యువత వ్యతిరేకి అని దుయ్యబట్టారు..ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కానీ.. మోడీ ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీ చేయడం లేదు. మా ప్రభుత్వం రాగానే ఈ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసి యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..