మల్లన్న సాగర్ ని హార్ట్ ఆఫ్ కాళేశ్వరంగా తీర్చిదిద్దారు. మల్లన్న సాగర్ ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. మానవ నిర్మిత మరో అద్భుతంగా మల్లన్న సాగర్ నిలవనుంది. 50టీఎంసీలతో 5ఔట్ లెట్లతో నిర్మాణం జరిగింది. ఈ కట్టకు వాడిన మట్టి 14.36లక్షల క్యూబిక్ మీటర్లు. ఆనకట్టకు 5ఓటీ తూములు..10టీఎంసీల నీటి నిల్వ, ఇదే డెడ్ స్టోరేజీ. తాగు,సాగు,పారిశ్రామిక, ఆక్వా,పర్యాటక, బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మల్లన్న సాగర్ నిర్మాణం జరిగింది. కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్, సింగూరు ప్రాజెక్టుకు నీటిని తరలించనున్నారు. తపాస్ పల్లి రిజర్వాయర్, మిషన్ భగీరథకు నీటి తరలింపు..దాంతో ఉత్తర,దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు వరప్రదాయినిగా నిలవనుంది మల్లన్న సాగర్. 9జిల్లాల వరస్రదాయినిగా మల్లన్న సాగర్ నిలవనుంది. మల్లన్న సాగర్ ప్రారంభంతో కాళేశ్వరం ప్రాజెక్ఉ పరిపూర్ణమయింది. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. కాళేశ్వరంతో 13జిల్లాలకు సాగు,తాగు నీరు అందనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..