గుజరాత్ మోడల్ పైన పటారం..లోన లొటారం అని, పేదలకు వ్యతిరేఖమైన మోడల్ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గతంలో స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా ఏం చేయలేదన్నారు. గుజరాత్ లో ఏదో పొడిచేసినట్లు ఈ సిపాయి నరేంద్రమోడీ వచ్చాడని విమర్శించారు. సోషల్ మీడియా, దొంగ ప్రచారాలతోని మోడీ గెలిచారని విమర్శించారు. ఆయన ఏదో చేస్తారని ప్రజలు నమ్మి ప్రజలు ఓటేశారన్నారు. ప్రస్తుతం 8 ఏళ్లు గడిచిపోయాయని..ఈయన బండారం బయట పడిందన్నారు. 10 ఏళ్లలో ఇది 8 వబడ్జెట్ అని ఇది దిక్కుమాలిన బడ్జెట్ అని అన్నారు. పవిత్రమైన గంగా నదిలో శవాలు తేలేలా చేసిందని విమర్శించారు. కరోనా సమయంలో వేలాది మంది చనిపోయారని… అంత దరిద్రమైన ప్రభుత్వం అని అన్నారు. దేశంలో మిడతలను ఎదుర్కొలేకపోయిందని మండిపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..