భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలు ఇస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఎతైన ప్రదేశాల్లో కాలనీలు నిర్మించాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు.ఈ మేరకు ముంపు బాధితులతో నేరుగా మాట్లాడారు సీఎం. వరదబాధితుల్లో ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ఇస్తామన్నారు..ఈ నెల 29వరకు వర్షాలు పడనున్నాయి. గోదావరి వరదల్లో ఏ ఒక్క ప్రాణమూ పోలేదన్నారు సీఎం. అధికారులు..పోలీసులు అద్భుతంగా పని చేశారన్నారు. ప్రాణ నష్టం లేకుండా చూశారన్నారు. ఇకపై ఇలాంటి ఇబ్బందులు రావొద్దన్నారు. ఊహించని విధంగా వరదలు వచ్చాయన్నారు. గోదావరి వరదకు శాశ్వత పరిష్కారం కావాలన్నారు. భగవంతుడి దయవల్లే కడెం ప్రాజెక్ట్ నిలబడిందన్నారు.
Breaking : వరద బాధితులకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలు-అద్భుతంగా పని చేసిన పోలీసులు..అధికారులు-సీఎం కేసీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement