హిందూధర్మం అంటే ఇదేనా అని సీఎం కేసీఆర్ అన్నారు. రాయగిరి బహిరంగసభలో ఆయన మాట్లాడారు..భువనగిరి జిల్లా అవుతుందని కలలో కూడా అనుకోలేదన్నారు.తెలంగాణ పోరాటంలో భువనగిరి ప్రజలు బొబ్బిలిలా పాల్గొన్నారని చెప్పారు. బిజెపి ఈ దేశానికి పట్టిన దరిద్రమని మండిపడ్డారు. ఆ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిదని అన్నారు. తెలంగాణ పోరాటంలో భువనగిరి బెబ్బులిలా పాల్గొందని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక..అస్సాం సీఎంని కించపరిచినట్లు మాట్లాడతారా అని మండిపడ్డారు కేసీఆర్. బిజెపిని ప్రశ్నిస్తున్నా, ఇదేనా మీ సంస్కారం అని అన్నారు. నా మనసు ఎంతో బాధపడుతోందన్నారు, నా కళ్లలో నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Breaking : ఈ దేశానికి పట్టిన దరిద్రం బిజెపి – త్వరగా వదిలించుకోవాలే – సీఎం కేసీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement