ఉద్యోగులతో చర్చల తర్వాత సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం మీది..అది గుర్తుంచుకోండని సీఎం వెల్లడించారు. ఉన్నంతలో ఉద్యోగులకు మంచి చేయడానికే ప్రయత్నించామని అన్నారు. ఇందులో రాజకీయాలు తలదూర్చడం వల్ల సమస్యలు జఠిలం అవుతాయన్నారు. మంచి కోసం నాలుగు అడుగులు ముందుకేస్తున్నామంటే ఉద్యోగులే కారణమని జగన్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోరినంత ఇవ్వకపోవచ్చని అన్నారు. ప్రభుత్వంపై అదనంగా రూ.11,500కోట్ల భారం పడనుందన్నారు. రాబోయే రోజుల్లో సీసీఎస్ పై గట్టిగా పనిచేస్తామని చెప్పారు. ఇక రిటైర్మెంట్ వయస్సు 60నుంచి 62ఏళ్లకు పెంచామన్నారు. 30వేల మంది టీచర్లకు ప్రమోషన్ ఇస్తున్నామని వెల్లడించారు..మీ సహాయ సహకారాలతోనే మంచి చెయ్యగలుగుతున్నామని సీఎం జగన్ ఉద్యోగస్తులకి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..