ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని వైసీపీ అధినేత సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వం వదిలి వెళ్ళిన బకాయిలన్నింటినీ చెల్లించుకుంటూ వస్తున్నామన్నారు. రైతు నష్టపోతే ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. నష్ట పోయిన మొత్తాన్ని సీజన్ ముగియక ముందే అందిస్తున్నామన్నారు. తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందన్నారు. గులాబ్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన 34వేల 586మంది రైతుల ఖాతాల్లోకి రూ.22కోట్ల పంట నష్ట పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశాం అన్నారు. ధాన్యం సేకరణకు రూ. 35వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త సంప్రదాయాన్ని అవలంభిస్తున్నామని జగన్ చెప్పారు. ఉచిత విద్యుత్ కోసం రూ.18వేల కోట్లు వెచ్చించినట్లు జగన్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily