ప్రజలపై టిడిపి అధినేత బాహాటంగానే వ్యతిరేకత చూపించారని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి రెచ్చగొట్టారని తెలిపారు. చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని స్పష్టమయిందన్నారు. కుప్పం ఫలితాలే ఇందుకు నిదర్శనం అన్నారు జగన్. చంద్రబాబు ఫ్రస్టేషన్ లో ఉన్నారని ప్రజలకు తెలుసని తెలిపారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని జగన్ వెల్లడించారు. సభలో చంద్రబాబు సంబంధం లేని అంశాలను ప్రస్తావించారని చెప్పారు. చంద్రబాబు కన్నీరు పెట్టాల్సిన అవసరం ఏంటని నిలదీశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..