ఉక్రెయిన్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన ఉత్తరాఖండ్ ప్రజలను వారి గమ్యస్థానానికి ఉచితంగా ప్రయాణం చేసేలా సౌకర్యాన్ని కల్పించాలని ఆ రాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి అత్తార్ సింగ్ కమిషనర్ కు లేఖ పంపారు. రైళ్లు, బస్సులు , ట్యాక్సీలు దేని ద్వారా వారు గమ్యస్థానానికి వెళ్లాలనుకుంటే అందులో వెళ్లేలా వారికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఉచిత ఏర్పాటు స్థానిక కమీషనర్ కార్యాలయం ద్వారా చేయబడుతుంది. మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వ్యక్తుల గురించి సమాచారాన్ని సేకరించడానికి మూడు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ గ్రూపుల్లో ప్రధాన కార్యదర్శి, అన్ని అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, సెక్రటరీ స్థాయి అధికారులు, గర్వాల్ ,కుమావోన్ డివిజనల్ కమిషనర్‌లతో పాటు, కలెక్టర్లు, పోలీసు కెప్టెన్‌లు, ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన లేదా అక్కడ చిక్కుకుపోయిన పౌరుల కుటుంబాలు కూడా ఉన్నారు. ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందుబాటులో ఉంచబడుతుంది.
Breaking : ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చే వారికోసం ఉచిత ఏర్పాట్లు – సీఎం ధామి ప్రకటన
Advertisement
తాజా వార్తలు
Advertisement