ప్రధాని నరేంద్ర మోడీ తీరు ..సమతామూర్తికి అవమానంగా భావిస్తున్నాం అన్నారు సీఎల్పీ నేత భట్టి. బిజెపిది విభజించు , పాలించు విధానమని అన్నారు. దక్షిణ భారతాన్ని, ఉత్తరాదిని వేర్వేరుగా చూడొద్దన్నారు. ప్రధాని వచ్చినప్పుడు సీఎం కానీ, ప్రభుత్వ ప్రతినిధిని కాని పంపొచ్చని భట్టి తెలిపారు. రామానుజుల స్ఫూర్తికి పూర్తి భిన్నంగా మోడీ పర్యటన సాగిందన్నారు. అసలు అది పెద్ద సమస్యగా చూడటం లేదన్నారు భట్టి. నిన్నటి కార్యక్రమం అంతా బిజెపి ప్రచార కార్యక్రమంగా సాగిందని చెప్పారు. రామానుజుల స్ఫూర్తితో పాలన కొనసాగించాలని మోడీకి , భట్టి హితవు పలికారు. మోడీ ప్రధానిగా సమతామూర్తిని ఆవిష్కరించారా , బిజెపి నేతగా సమతామూర్తిని ఆవిష్కరించారా అని ప్రశ్నించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..