ఏఐసీసీ సమావేశం ముగిసింది. మూడు గంటలపాటు ఈ భేటీ కొనసాగింది. వచ్చే నెల దేశవ్యాప్తంగా పెరిగిన ధరలపై ఆందోళనలు చేపట్టనున్నారు. సామాన్యుడి నడ్డి విరుస్తున్న పెట్రోల్, గ్యాస్, ఇతర నిత్యావసర ధరలపై వచ్చేనెల దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో మూడు గంటలపాటు కొనసాగిన AICC మీటింగ్‌లో పార్టీకి పునర్‌వైభవం తేవడంతోపాటు ఎన్డీయే ప్రభుత్వంలో ధరల పెరుగుదల అంశంపై రాజీలేని పోరాటం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో సమూల ప్రక్షాళనపై దృష్టి పెట్టింది . అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతున్న పార్టీని గాడిలో పెట్టేందుకు కసరత్తు చేశారు. పార్టీని బతికించుకోవడంతోపాటు పూర్వవైభవం తెచ్చేలా చర్చించారు. అయితే పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి బదులు ప్రియాంకాగాంధీ హాజరయ్యారు. రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి పై పలు సూచనలు, అభిప్రాయాలను నాయకులు అధిష్టానికి విన్నవించారు. ఈ భేటీలో సంస్థాగత నిర్మాణంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా.. ఏప్రిల్ 7న రాష్ట్రాల రాజధానుల్లో నిరసనలతో పాటు ‘థాలీ బజావో’ పేరిటా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతోపాటు.. బీజేపీపై పోరాటానికి త్వరలో పూర్తి కార్యాచరణ ప్రకటించనున్నారు.
Breaking : ముగిసిన ఏఐసీసీ భేటీ – పెరిగిన ధరలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు
Advertisement
తాజా వార్తలు
Advertisement