వేదికపై నన్ను ఇబ్బంది పెట్టారన్నారు టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. రూరల్ సీఐని ఎందుకు ఇలా జరిగిందని అడిగానన్నారు..పోలీసులు అంటే నాకు గౌరవం ఉందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే పోలీసులకి ఫోన్లు చేశానన్నారు. ఆ ఆడియో రికార్డు తన దగ్గర ఉందన్నారు.అది ఎలా వచ్చిందో తెలియదన్నారు. సీఐని తాను దూషించలేదని స్పష్టం చేశారు. నేను మనస్తాపం చెందానని ఎమ్మెల్యే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రూల్ సీఐ,టౌన్ సీఐతో మాట్లాడానన్నారు. ఆ ఆడియో రికార్డు తనది కాదన్నారు. భార్యని చంపిన వ్యక్తిని నా ముందు వేదికపై కూర్చొబెట్టారన్నారు. మా ముందు రౌడీషీటర్లు వచ్చి ఇబ్బంది పెట్టారన్నారు. ఎమ్మోల్యే వెంటే ఇద్దరు రౌడీ షీటర్లు ఉంటారన్నారు. తాండూరు ప్రజలు రౌడీలు కాదు..దేవుళ్లని అన్నారు.
Breaking : సీఐని దూషించలేదు – పోలీసులంటే గౌరవం ఉంది – పట్నం మహేందర్ రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement