ప్రభుత్వ విప్ ,చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ , టీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ పైన ఉన్న తెలంగాణ ఉద్యమ కేసును ప్రజా ప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి కె.జయకుమార్ కొట్టివేస్తూ తీర్పును వెల్లడించారు. కేసును వాదించిన న్యాయవాదుల్లో ఒకరైన జక్కుల లక్ష్మణ్ మాట్లాడుతూ.. 2009 లాలాగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో తార్నాకలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు బాల్క సుమన్ ,రాజారాం యాదవ్ తదితరులు తెలంగాణ బంద్ సందర్బంగా నినాదాలు చేస్తూ.. పెట్రోల్ పంపులో అద్దాలు పగలగొట్టారని లాలగూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ కేసుని విచారించిన ప్రజా ప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి కె.విజయ్ కుమార్ కొట్టివేశారు.ఈ కేసుని జి.కిరణ్ కుమార్, జక్కుల లక్ష్మణ్,శ్రీనాథ్, జి.రాము తదితర న్యాయవాదులు వాదించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement