ఏపీ అసెంబ్లీలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్తాపం చెందారు. మళ్లీ సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగుపెడతానని శపథం చేశారు. సభలో పరిణామాలపై చంద్రబాబు తీవ్ర మనస్థాపం చెందారు. పార్టీ ఎమ్మెల్యేల భేటీలో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. సభలో తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడటంపై చంద్రబాబు తీవ్ర ఆవేదన చెందారు. వ్యక్తి గతంగా ఇబ్బంది పెట్టారని..మాటల్లో చెప్పరాని మాటలు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభ నుండి చంద్రబాబు బయటికి వెళ్ళిపోయారు.
మండలి సమావేశం నుంచి హుటా హుటిన లోకేష్, యనమల సహా ఇతర ఎమ్మెల్సీలను పిలిపించారు చంద్రబాబు..సభలో వైసీపీ సభ్యుల తీరుపై చర్చ జరిపారు. వైసీపీ సభ్యులు శృతి మించేలా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు ఎమ్మెల్యేలు. కుటుంబంలోని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సభలో వైసీపీ సభ్యులు కామెంట్లు చేస్తున్నారన్నారు అచ్చెన్నాయుడు.చంద్రబాబు కుటుంబంలోని మహిళలపై వైసీపీ ఎమ్మెల్యేలు సభలోనే నోరు పారేసుకుంటున్నారని మండిపడుతోంది టీడీపీ ఎమ్మెల్యేలు. స్పీకర్ కూడా మౌనంగా ఉంటూ వైసీపీని కట్టడి చేయడం లేదని వాపోయారు. సభలో జరిగిన పరిణామాలు చూస్తోంటే తీవ్ర ఆవేదన కలుగుతోందన్నారు.