Friday, November 22, 2024

Breaking : చంద్ర‌బాబునాయుడికి భ‌ద్ర‌త పెంచిన ఎన్ ఎస్ జీ-24ఎన్ ఎస్ జీ క‌మెండోల‌తో భ‌ద్ర‌త‌

కేంద్రం ఇంటెలిజెన్స్ స‌మాచారంతో టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు 24ఎన్ ఎస్ జీ క‌మెండోల‌తో భ‌ద్ర‌త‌ .. కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు చంద్ర‌బాబు . నేడు కృష్ణానందపల్లె, గుండ్లనాయనపల్లె, కొత్తూరులో చంద్రబాబు టూర్ ఉంది. కుప్పంలో తాజా పరిణామాలతో ఆయనకు భద్రత పెంచినట్లు తెలుస్తోంది. గతంలో 8 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఉండగా.. నేటి నుంచి అదనంగా నలుగురుని అద‌నంగా నియమించినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం 12మంది చంద్రబాబుకు సెక్యూరిటీ ఇవ్వనున్నారు. అంతేకాదు గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా.. ఇకపై డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో పనిచేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు గురువారం ఎన్‌ఎస్‌జీ డీఐజీ సమరదీప్ సింగ్ టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఉండవల్లి నివాసాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే. కుప్పంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. గురువారం కుప్పంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు క్యాంటిన్‌ను ధ్వంసం చేయడం.. ఫ్లెక్సీలను చించేయడంతో హై టెన్షన్ వాతావరణం కనిపించింది. దీంతో చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి పోటీగా వైఎస్సార్‌సీపీ కూడా ఆందోళనకు దిగింది. టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు దాడి చేశాయని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ దాడిలో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని.. వారిని అధినేత చంద్రబాబు కుప్పం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పరామర్శించారు. గంగమ్మ గుడి మాజీ చైర్మన్ రవిచంద్ర.. కార్యకర్త రాజుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అధైర్యపడొద్దని, పార్టీ అండగా నిలుస్తుందన్నారు. కుప్పంలో వైఎస్సార్‌సీపీ ఉన్మాదం పరాకాష్టకు చేరుకుందని.. ఆ పార్టీ నేతలు హద్దులు మీరి ప్రవర్తించారన్నారు.ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కి సెక్యూరిటీని పెంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement