తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు ఐటీశాఖ మంత్రి కేటీఆర్. అనంతరం ఆయన మాట్లాడుతూ..వరి కొనుగోళ్లపై కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామన్నారు. ఢిల్లీకి మంత్రులు వెళ్లి కేంద్రంలోని పెద్దలను కలిశారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణభవన్ లో ఆయన మాట్లాడుతూ..కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను ఇంతకు ముందుకూడా కలిశామన్నారు. ఆహార భద్రత కింద వరి కొనుగోలు చేయాలని చెప్పామన్నారు. కేంద్రం తలా తోక లేని ప్రభుత్వం..కార్పొరేట్లకు వత్తాసు పలికే ప్రభుత్వం అని మండిపడ్డారు కేటీఆర్. రైతులపై ఏ మాత్రం ప్రేమలేని ప్రభుత్వమని అన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మేం చెప్పాం అన్నారు. యాసంగిలో వడ్లు వేయొద్దని మేం చెప్పామన్నారు. ప్రతీ ఏటా వడ్డు కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే అన్నారు.
Breaking : రైతులను విస్మరించి – కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోన్న కేంద్రం – మంత్రి కేటీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement