హైదరాబాద్ ఎస్.ఆర్ నగర్ లో వైద్యుడు రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సెలైన్ లో విషం కలుపుకుని రాజ్ కుమార్ సూసైడ్ చేసుకున్నాడు. అమీర్ పేట ప్రైవేట్ ఆస్పత్రిలో రాజ్ కుమార్ పని చేస్తున్నాడు. కాగా రాజ్ కుమార్ స్వస్థలం కడప జిల్లా బద్వేల్. కార్డియాలజిస్ట్ డా. రాజ్ కుమార్ డిప్రెషన్ తో సూసైడ్ చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. డిప్రెషన్ వాదనని ఆయన తండ్రి కొట్టిపారేశారు. రాజ్ కుమార్ ఆత్మహత్యపై పలు సందేహాలు వ్యక్తం చేశారు ఆయన తండ్రి. ఏం జరిగిందో కనిపెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో హాస్పటల్ స్టాఫ్, ఫ్రెండ్స్ ను పోలీసులు విచారిస్తున్నారు.
Breaking : డాక్టర్ సూసైడ్ : పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి
Advertisement
తాజా వార్తలు
Advertisement