తెలంగాణ బడ్జెట్ అమలు సరిగా లేదని కాగ్ నివేదిక తెలిపింది. బడ్జెట్ లో ఆమోదానికి మించి ప్రభుత్వం అధిక వ్యయం చేస్తోందని కాగ్ నివేదికలో తెలిపారు. 5ఏళ్లలో రూ.84,650కోట్లు అధికంగా వ్యయం చేసిందని కాగ్ రిపోర్ట్ లో తేలింది. 2020-21లో ఓవర్ డ్రాప్ట్ ద్వారా రూ. 21,287కోట్లు తీసుకుందని కాగ్ రిపోర్ట్ లో తెలిపారు. 158రోజుల కోసమే రూ.21వేల కోట్లు ఓవర్ డ్రాప్ట్ చేసిందని వెల్లడించింది.2018-19లో రెవెన్యూ మిగులులో ఉన్న రాష్ట్రం..ఆ తర్వాత రెవెన్యూ లోటులో పడిందని వివరించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..