ప్రమాదవశాత్తు లగ్జరీ బస్సులో మంటలు చెలరేగాయి..దాంతో బస్సులో ప్రయాణిస్తోన్న 45మంది సజీవ దహనం అయ్యారు..ఈ దుర్ఘటన యూరప్ లోని బల్గేరియాలో చోటు చేసుకుంది. ఈ బస్సు బల్గేరియా రాజధాని సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతుండగా మంటల్లో చిక్కుకుంది. ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దివ్యవధిలోనే బస్సు కాలిపోయింది. ఈ ఘటనలో 45 మంది మరణించగా, ఏడుగురు గాయాలతో బయటపడ్డారు. చనిపోయిన వారిలో 12 మంది చిన్నారులు ఉండడం అందరినీ కలచివేసింది. మృతదేహాలు ఏమాత్రం గుర్తించలేని విధంగా బూడిదగా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..