ముస్లిం యువతులను, యంగ్ ఏజ్ వారిని టార్గెట్ చేసుకుని వారి ఫొటొలను యాప్ ద్వారా వెబ్ లో పోస్టు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ‘బుల్లి బాయ్’ ని పోలీసులు పట్టుకున్నారు. నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తో పాటు డీజీపీకి ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైపీ కంప్లేంట్ చేశారు. అంతే కాకుండా హైదరాబాద్ పోలీసులకు కూడా చాలా మంది బాధితులు ట్విట్టర్ ద్వారా తాము ఎలా ఇబ్బందులకు గురవుతున్నామో అనే విషయాలను వివరించారు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కూడా బుల్లి బాయ్ యాప్ నిర్వాహకుల కోసం వేట కొనసాగిస్తున్నారు. \
కొంతమంది యువతుల ఫొటోలను బుల్లి బాయ్ యాప్ లో పోస్టు చేసి వారిని అమ్మకానికి పెట్టినట్టు యాప్ నిర్వాహకులపై ఫిర్యాదులు అందాయి. కావాలనే కొంతమంది యువతులను వేధింపులకు గురిచేస్తున్నట్టు వారు ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఢిల్లీ, ముంబయి, ఉత్తర ప్రదేశ్ లలో నూ ఇట్లాంటి ఘటనలు జరిగినట్టు తెలిసింది. దీంతో ఇవ్వాల ముంబయిలో ‘బుల్లి బాయ్‘ యాప్ నిర్వాహకుడు విశాల్ కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు బాంద్రా కోర్టులో అరెస్టు చూపినట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.