ప్రమాదవశాత్తు పడవ ప్రమాదం జరిగింది..ఈ ప్రమాదంలో 31మంది మృతి చెందారు..ఈ దుర్ఘటన ఇంగ్లీష్ ఛానల్ లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 31 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ మంత్రి ప్రకటించారు. పడవలో 34 మంది ప్రయాణిస్తుండగా.. పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 31 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.. ఇద్దరు సజీవంగా ఉన్నారని ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ డర్మానిన్ వెల్లడించారు. మరొకరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని చెప్పారు. కాగా, మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ చాన్నారి కూడా ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన వసలదారులు ఏ దేశ పౌరులు అనేది ఇంకా తెలియలేదు.
ప్రాణాలతో బయటపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులను కలిసేందుకు ఫ్రెంచ్ ఇంటీరియర్ మినిస్టర్ ఆస్పత్రికి వెళ్లారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి నలుగురు అనుమానిత మానవ అక్రమ రవాణాదారులను అరెస్టు చేసినట్లు ఫ్రెంచ్ మంత్రి తెలిపారు. ఇంగ్లీష్ ఛానల్‌ను దాటేందుకు ప్రయత్నిస్తున్న చిన్న ఓడల సంఖ్య రెండింతలు పెరిగిందని లోకల్ సీ అథారిటీ చీఫ్ ఫిలిప్ డ్యూట్రిక్స్ గత వారం ఒక ఇంటర్వ్యూలో హెచ్చరించారు. సామర్థ్యానికి మించి జనం ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంచనా వేశారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..