ఇప్పటి వరకు జంతువులకే పరిమితమయిన బర్డ్ ఫ్లూ కేసు మొదటిసారిగా మనుషులకి సోకింది. అమెరికాకి కొలరాడోకు చెందిన వ్యక్తిలో ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా ఏ(హెచ్5) వైరస్ పాజిటివ్ గా బయటపడినట్టు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) విభాగం ప్రకటన విడుదల చేసింది. హెచ్5 వైరస్ మనుషుల్లో కనిపించడం అరుదు. ఇలాంటిదే ఒక కేసు 2021 డిసెంబర్ లో బ్రిటన్ లోనూ వెలుగు చూసింది. కొలరాడో వ్యక్తికి కొన్ని రోజులుగా అలసటగా ఉండడం తప్పించి మరే ఇతర లక్షణాలు కనిపించలేదని సీడీసీ తెలిపింది. అతడు ఒక్కడినీ విడిగా ఉంచి ఇన్ ఫ్లూయెంజా యాంటీ వైరల్ ఔషధంతో చికిత్స చేసినట్టు పేర్కొంది. ఇప్పుడు ఆ రోగి పూర్తిగా కోలుకున్నాడు. బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1 వైరస్) బారిన పడిన పక్షులకు పన్నిహితంగా ఉన్న 2,500 మందిని పరిశీలనలో ఉంచినట్టు సీడీసీ ప్రకటించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement