నాణ్యమైన విద్యుత్ అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు ఏమయ్యాయన్నారు. ఖాళీగా ఉన్న 15లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడని నిలదీశారు మంత్రి. బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి చూపించారన్నారు. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా ..జాతీయ హోదా కల్పించకపోవడం వివక్షకు నిదర్శనమని అన్నారు. మొన్నటి బడ్జెట్ లో తెలంగాణకి న్యాయం జరగలేదన్నారు తలసాని. బిజెపీకి తెలంగాణలో పర్యటించే హక్కుందా అని మంత్రి ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీ విభజనపై మరోసారి మాటల యుద్ధం ప్రారంభం అయింది. కాంగ్రెస్ సంగతి అటుంచి..ప్రధాని మోడీ ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..