ఢిల్లీలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, ప్రెసిడెంట్ జేపీ నడ్డా,సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు తదితరులు హాజరయ్యారు. జాతీయకార్యవర్గ సభ్యులు,పలు రాష్ట్రాల అధ్యక్షులు వర్చువల్ గా ఈ సమావేశానికి హాజరైయ్యారు. ఏడు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపై ఈ మీటింగ్ లో ప్రధానంగా చర్చించనున్నారు. 2022మార్చిలో పంజాబ్,యూపీ,ఉత్తరాఖండ్,గోవా,మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2022చివరిలో గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఇటీవల జరిగిన బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఉప ఎన్నికల్లో ఓటమి కారణాలపైనా విశ్లేషించనున్నారు. అలాగే కొవిడ్ కట్టడిలో కేంద్రం పనితీరు, టీకా పంపిణీ ప్రక్రియ, ప్రధాని ఇటలీ, బ్రిటన్ టూర్, జీఎస్టీ వసూళ్ల రికార్డ్‌పైనా చర్చించనున్నారు. గతేడాది కరోనా వ్యాప్తి తర్వాత బీజేపీ కార్యవర్గ భేటీ జరగడం ఇదే తొలిసారి.
breaking : బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం..ఏడు రాష్ట్రాల ఎన్నికలపై చర్చ..
Advertisement
తాజా వార్తలు
Advertisement