పలువురు సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. కాగా బిజెపి ఎంపీ వరుణ్ గాంధీ కరోనాకి గురయ్యారు. ట్విట్టర్ లో ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఇన్ఫెక్షన్ తాలూకు బలమైన లక్షణాలతో తాను ఇబ్బందిపడుతున్నట్లు వెల్లడించారు. కాగా ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతుండడం పట్ల వరుణ్ గాంధీ ఆందోళన కూడా వ్యక్తం చేశారు. యూపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ కార్యకర్తల రక్షణ కోసం ఈసీ చర్యలు తీసుకోవాలని వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. కరోనా మూడో విడత, ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నాం. ఎన్నికల అభ్యర్థులు, కార్యకర్తలకు ప్రికాషనరీగా (ముందస్తు) కరోనా టీకా డోసులను ఇచ్చే చర్యలను ఈసీ తీసుకోవాలి’’అని వరుణ్ గాంధీ కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..