చండీగఢ్ : మాజీ క్రికెటర్ దినేష్ మోంగియా ఢిల్లీ పార్టీ కార్యాలయంలో బిజెపి పార్టీలోకి చేరారు. ఈయన వయస్సు 44. భారత్ తరపున అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. ఈయన పంజాబ్ కి చెందిన వాడు. ఈయనతో పాటు ముగ్గురు పంజాబ్ ఎమ్మెల్యేలు ఫతే జంగ్ బజ్వా, బల్వీందర్ సింగ్ లడ్డీ, రాణా గుర్మీత్ సోధీ కూడా బిజెపిలో చేరడం విశేషం. పంజాబ్ ఎన్నికలకు ముందు మాజీ క్రికెటర్ దినేష్ మోంగియా బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది..కాగా మాజీ క్రికెటర్లు ఎన్నికల ముందు రాజకీయ పార్టీల్లో చేరడం మాములు విషయమే. 2019 సాధారణ ఎన్నికలకు ముందు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యర్థి అతిషిపై దాదాపు ఐదు లక్షల ఓట్లతో గెలుపొందారు.పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఎన్నికల పోరు గత ఎన్నికల మాదిరిగా కాకుండా ఈసారి రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిష్క్రమణ తర్వాత, కాంగ్రెస్ కవచంలో చిచ్చు పెట్టాలని చూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ వంటి ప్రత్యర్థుల నుంచి ఆ పార్టీ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వం