Thursday, November 21, 2024

Breaking : బిట్ కాయిన్ .. క‌రెన్సీ కాదు .. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ..

క్రిప్టోక‌రెన్సీపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. దేశంలో బిట్‌కాయిన్‌ ను క‌రెన్సీగా గుర్తించేందుకు ఎటువంటి ప్ర‌తిపాద‌న లేద‌ని తెలిపింది. బిట్‌కాయిన్ లావాదేవీలపై ప్రభుత్వం డేటాను సేకరించట్లేదని ఆమె హౌస్‌లో వెల్లడించింది. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ లోక్‌ స‌భ‌లో లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు. బిట్‌కాయిన్ లావాదేవీల‌కు చెందిన డేటాను ప్ర‌భుత్వం సేక‌రించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో క్రిప్టో బిల్లును ప్ర‌వేశ‌పెట్టాల‌ని కేంద్రం యోచిస్తోంది.

బిట్‌ కాయిన్ లావాదేవీల నియంత్ర‌ణ కోసం రెగ్యులేట‌రీ వ్య‌వ‌స్థ అవ‌స‌రం అన్న అభిప్రాయాన్ని ఇటీవ‌ల కేంద్ర ప్రభుత్వాన్ని వ్య‌క్తం చేసింది. అయితే బ్యాంక్ నోటు అన్న నిర్వ‌చ‌నాన్ని మారుస్తూ, దాంట్లో డిజిట‌ల్ క‌రెన్సీని కూడా జోడించే విధంగా ఆర్బీఐ చ‌ట్టాన్ని స‌వ‌రించాల‌ని ఇటీవ‌ల కేంద్రాన్ని ఆర్బీఐ కోరింది. పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో క్రిప్టో క‌రెన్సీ ..రెగ్యులేష‌న్ ఆఫ్ అఫీషియ‌ల్ డిజిట‌ల్ క‌రెన్సీ బిల్లు 2021ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. ఈ క్ర‌మంలో స‌భ్యులు లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌కు ప్ర‌భుత్వం స‌మాధానం ఇచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement