Friday, November 22, 2024

Breaking : బికినీ, జీన్స్, హిజాబ్ – ఏం ధ‌రించాల‌న్నా మా ఇష్టం – ట్వీట్ చేసిన ప్రియాంక‌గాంధీ

హిజాబ్ వ్య‌వ‌హారం క‌ర్నాట‌క‌తో పాటు మ‌ధ్య‌ప్ర‌దేశ్, పుదుచ్చేరిల‌కి పాకింది. కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ ఈ విష‌యంపై మాట్లాడారు. బికినీ వేసుకున్నా.. గూంగ‌ట్ ధ‌రించినా.. జీన్స్ వేసుకున్నా.. హిజ‌బ్ ధ‌రించినా.. తాము ఏం ధ‌రించాల‌న్న‌ది.. మ‌హిళ‌ల‌కు చెందిన హ‌క్కు అని తెలిపారు. మ‌హిళ‌ల‌ను వేధించ‌డం ఆపేయాల‌ని, న‌చ్చిన దుస్తుల్ని ధ‌రించ‌డం మ‌హిళ‌ల హ‌క్కు అని ఆమె స్ప‌ష్టం చేశారు. కర్నాటకలో క్లాస్‌రూమ్‌లలో హిజాబ్ ధరించకుండా నిషేధించబడిన కళాశాల విద్యార్థులకు మద్దతుగా ఆమె మాట్లాడారు. ఏ దుస్తులు ధరించాలనే ఎంపిక వారిదేననీ, ఈ హక్కు రాజ్యాంగం ద్వారా క‌ల్పించ‌బ‌డిందంటూ ప్రియాంక గాంధీ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

“అది బికినీ అయినా, గూంగ‌ట్‌ అయినా , ఒక జత జీన్స్ అయినా, లేదా హిజాబ్ అయినా, తాను ఏమి ధరించాలో నిర్ణయించుకోవడం ఒక మహిళకు సంబంధించిన‌ హక్కు. ఈ హక్కు భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడింది. మహిళలను వేధించడం ఆపండి” అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. #ladkihoonladsaktihoon అనే హ్యాష్‌ట్యాగ్ ను త‌న ట్వీట్ కు జోడించారు. అలాగే, కాంగ్రెస్ నాయ‌కుడు, కేర‌ళ ఎంపీ రాహుల్ గాంధీ సైతం త‌న సోద‌రి ట్వీట్ పై ‘థంబ్స్-అప్’ ఎమోజీతో స్పందించారు. కాగా, గురువారం నుంచి ఏడు ద‌శ‌ల్లో యూపీ ఎన్నిక‌లు ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే #ladkihoonladsaktihoon ప్ర‌చారంలో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. మ‌రీ ముఖ్యంగా మహిళా హక్కులు, మ‌హిళా సాధికారతపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక అంశాల‌ను లేవ‌నెత్తింది. మ‌హిళా హ‌క్కుల‌ను అంశాన్ని ప్రియాంక గాంధీ ప్ర‌స్తావిస్తూ.. ఎన్నిక‌ల ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement