సామాన్యులకు మరోసారి షాక్ తగిలింది.. అమూల్ పాల ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇంధనం, లాజిస్టిక్స్, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడం వల్ల అమూల్ పాల ధరలు మరోసారి పెరగవచ్చని అమూల్ కంపెనీ అధికారులు తెలిపారు. అయితే ఈసారి ధర ఎంత పెరుగుతుందనేది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. అంతకుముందు, మార్చి 1, 2022 న, అమూల్ కూడా లీటరు పాల ధరలను రూ.2 పెంచింది. కాగా అమూల్ ఎండీ ఆర్ ఎస్ సోధి మీడియాతో చర్చానంతరం మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి ధరలు తగ్గవ్ కానీ పెరుగుతాయన్నారు. కో-ఆపరేటివ్ యూనియన్ గత రెండేళ్లలో అమూల్ మిల్క్ ధరలను 8 శాతం పెంచిందని సోధి చెప్పారు. ఇందులో గత నెలలో పాల ధరలను లీటరుకు రూ.2 పెంచారు. రానున్న కాలంలో అమూల్ పాల ధర పెరగవచ్చని సోధి మాటలను బట్టి అర్థమవుతోంది. తన పరిశ్రమలో ద్రవ్యోల్బణం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది రైతులకు అధిక ధరల నుండి ప్రయోజనం చేకూరుస్తుందని సోధీ అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement