Friday, November 22, 2024

Breaking : భువ‌నేశ్వ‌రిపై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు స‌రికాదు..మేం చేతులు క‌ట్టుకుని కూర్చోలేదు..రామ‌కృష్ణ‌..

నిన్న ఏపీ అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై మీడియా ముందుకొచ్చింది నంద‌మూరి కుటుంబం. నిన్న టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు క‌న్నీళ్లు పెట్టుకున్న ఘ‌ట‌న‌పై నంద‌మూరి కుటుంబం స్పందించింది. ఈ సంద‌ర్భంగా రామ‌కృష్ణ మాట్లాడుతూ భావోద్వేగానికి లోన‌య్యారు. నా చెల్లెలు భువ‌నేశ్వ‌రిపై వ్యాఖ్య‌లు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అన్నారు. భువ‌నేశ్వ‌రిపై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు స‌రికాద‌న్నారు. జ‌రిగింది చూస్తే చాలా బాధ‌గా ఉంద‌ని తెలిపారు. మీ ఇంట్లో ఆడ‌వాళ్లే మిమ్మ‌ల్ని ఛీత్క‌రించుకుంటున్నార‌న్నారు. కొడాలి నాని,వంశీ,అంబ‌టి రాంబాబుల‌కు రాంబాబు,ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిల‌కు ఇదే మా హెచ్చిరిక‌.. మేం చేతులు క‌ట్టుకుని కూర్చోలేద‌న్నారు. మా ఆడ‌వాళ్ల జోలికి వ‌స్తే ఊరుకునేది లేద‌న్నారు. మా కుటుంబం గురించి మాట్లాడితే బాగుండ‌ద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement