ఆదిలాబాద్ జిల్లాలో అనాగరిక చర్య. 12కుటుంబాలను వెలివేశారు కుల పెద్దలు.కులంలోకి రావాలంటే జరిమానా కట్టాలని హుకుం జారీ చేశారు. మూడేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నారు బాధిత కుటుంబాలు.శుభకార్యాలకు, చావులకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. చేపల వేట విషయంలో చిన్న వివాదమే దీనికి కారణమని స్థానికులు తెలిపారు. సంఘం భవనం కోసం డబ్బులు ఇవ్వలేదని, 12కుటుంబాలను దూరంగా ఉంచామని పెద్దలు తెలిపారు. ఖోడద్ చేపల చెరువు విషయంలో వివాదం తలెత్తిందని మత్సకారుల సంఘం నేతలు వెల్లడించారు. కాగా తాజాగా మూడేళ్ల నాటి నిర్ణయం వెలుగులోకి వచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..