మీర్ ఉస్మాన్ అలీఖాన్ దారిలోనే సీఎం కేసీఆర్ నడుస్తున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బిజెపి సభలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్బంగా ఈ సభ జరిగింది.ఈ సందర్భంగా బండి సంజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. టిఆర్ ఎస్ పాలనలో తెలంగాణ అంథకారంలో ఉందని నడ్డా అన్నారు. తెలంగాణలో వెలుగులు నింపడానికే బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారన్నారు. ఓరుగల్లు గడ్డ అని తెలుగులో ప్రసంగించారు నడ్డా..భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మూడు విడతల్లో బండి సంజయ్ చేసిన పాదయాత్ర సక్సెస్ అయిందన్నారు. జల్ జీవన్ మిషన్ కిందరూ.3098కోట్లను ప్రకటించాం అన్నారు. కానీ తెలంగాణ రూ.200కోట్లే తీసుకుంది..కేంద్రం ఇచ్చే నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. తెలంగాణకి మొదట మద్దతు పలికిందే బిజెపి అన్నారు.40వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ..లక్షా 40వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు.
Breaking : తెలంగాణలో వెలుగులు నింపేందుకే బండి సంజయ్ పాదయాత్ర- జేపీ నడ్డా
Advertisement
తాజా వార్తలు
Advertisement