సింహాచలం ఆలయ చైర్మన్ గా పూసపాటి అశోక్ గజపతిరాజును నియమిస్తూ ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో 14మంది పాలక సభ్యులను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియమించిన ఆలయ పాలక వర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది. ఇది ఇలా ఉండగా.. వైసీపీ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. సింహాచలం ఆలయ పాలక వర్గ చైర్మెన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించింది. అంతే కాకుండా.. సింహాచలం ఆలయ కమిటీ చైర్మెన్ గా అశోక్ గజపతిరాజు ..కూతురు సంచయితతో పాటు మరి కొందరిని సభ్యులుగా చేస్తు 2020 ఉత్తర్వులు జారీ చేసింది.దీనిపై అశోక్ గజపతి రాజు.. హై కోర్టును ఆశ్రయించారు. చాలా రోజుల పాటు విచరణ జరగగా.. హై కోర్టు ..అశోక్ గజపతి రాజుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాజా గా పాత ఆలయ కమిటీనే నియమిస్తు.. ఉత్తర్వులను జారీ చేసింది.
Breaking : సింహాచలం ఆలయ చైర్మన్ గా అశోక్ గజపతి రాజు – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Advertisement
తాజా వార్తలు
Advertisement